ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బోనాల పండుగ సందర్భంగా ఫలారం బండి కార్యక్రమం పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

అర్జున్ సమాచారం:
ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ లోని మెయిన్ రోడ్డు,ఆనంద్ నగర్, మరియు స్వరాజ్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఫలారం బండి కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే  వి. నవీన్ యాదవ్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.

అనంతరం భక్తులను పలకరించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు, పాల్గొన్నారు.
=========================